మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Jul 22 2025 8:02 AM | Updated on Jul 22 2025 8:02 AM

మత్తు

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు

● సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌క్రైం/జమ్మికుంట: నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. మత్తు పదార్థాలు కట్టడి చేసేందుకే కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేకంగా నార్కోటిక్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం నార్కోటిక్‌ జాగిలం రాంబోతో జమ్మికుంట ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. జమ్మికుంట టౌన్‌ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, పార్సిల్‌ కార్యాలయాలు, కిరాణ, పాన్‌ దుకాణాలు వంటి ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. నార్కోటిక్స్‌ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్‌ జాగిలం, డాగ్‌ హ్యాండ్లర్‌ కానిస్టేబుల్‌ కపిల్‌ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కమిషనరేట్‌వ్యాపంగా ఈ తనిఖీలు నిత్యం జరుగుతాయని స్పష్టం చేశారు.

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

హుజూరాబాద్‌: ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం పట్టణంలోని సిటీ సెంట్రల్‌ ఫంక్షన్‌ హాల్‌లో జాబ్‌మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువత వృత్తి నైపుణ్యం కోసం ఉద్యోగాల్లో చేరాలని, నిరుద్యోగులకు సరైన దారిని చూపించడమే ధ్యేయమని, ఉద్యోగం ఎక్కడ చేసేందుకై నా సిద్ధంగా ఉండాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాలో 85 కంపెనీలు పాల్గొనగా ఐదువేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు.

చొప్పదండి పీఏసీఎస్‌

ఇతర సంఘాలకు ఆదర్శం

చొప్పదండి: చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా అవార్డు అందుకున్న సందర్భంగా సంఘం అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ముద్దం మహేష్‌, డైరెక్టర్లు గుర్రం ఆనంద్‌ రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డిని విజయనగరం రెడ్డి రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఉస్కే రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడుసార్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్‌ అవార్డు అందుకునేలా ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిపిన పాలకవర్గాన్ని అభినందించారు. సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ సంఘంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న వెల్మ మల్లారెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో కొమ్ముల హన్మంత రెడ్డి, గుర్రం జగన్‌ మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాధికారం దిశగా

రజక చైతన్య సదస్సులు

కరీంనగర్‌రూరల్‌: స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రజకులు రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్‌కుమార్‌ అన్నారు. సోమవారం దుర్శేడ్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మడేలేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పరిశీలించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఎంపీ ల్యాడ్‌ నిధుల నుంచి ప్రహరీ నిర్మాణానికి సెప్టెంబర్‌లో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన రజక సదస్సులో సంపత్‌ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న రజకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లుగా పోటీ చేయాలన్నారు. 50 ఏళ్లు నిండిన రజ కులకు నెలకు రూ.5వేల పెన్షన్‌ ఇవ్వాలని, బట్టల మూటలను తీసుకెళ్లడానికి ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రజకబంధు పేరుతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.10లక్షల రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రజక సంఘం నాయకులు నేరెల్ల శ్రీనివాస్‌, మహేశ్‌, రాజు, పవన్‌, మహేశ్‌, ఎన్‌.రాజు, కె.రాజు, నరేశ్‌, సతీశ్‌, అనిల్‌ పాల్గొన్నారు.

మత్తు పదార్థాలు   విక్రయిస్తే కఠిన చర్యలు1
1/1

మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement