
బోనం.. వైభవం
కరీంనగర్‌కల్చరల్: ఆషాఢమాసం.. ఆఖరు ఆదివారం నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. బోనాల పండుగతో వైభవం సంతరించుకుంది. వాడవాడన డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు ఆనందోత్సాహాలతో ర్యాలీగా వెళ్లి పోచమ్మతల్లికి బోనం సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, గాజుల, వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి బోనం ఎత్తారు. కోతిరాంపూర్‌లోని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించారు. మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం, మార్కండేయనగర్, రాంనగర్‌లో జరిగిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రాంచంద్రపూర్‌కాలనీలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ బోనం ఎత్తారు.
నగరంలో ఘనంగా
ఆషాఢం బోనాలు

బోనం.. వైభవం

బోనం.. వైభవం

బోనం.. వైభవం

బోనం.. వైభవం