
సంఘటిత పోరాటాలకు సన్నద్ధం కండి
కరీంనగర్ అర్బన్: సమస్యల పరిష్కార క్రమంలో ఉద్యోగులు సంఘటిత పోరాటానికి సన్నద్ధంగా ఉండాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. టీఎన్జీవోభవన్‌లో ఆదివారం తెలంగాణ వ్యవసాయశాఖ మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. వ్యవసాయ మినిస్ట్రీయల్ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు శ్రీహరి, సెక్రటరీ అరుణ్‌కుమార్ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట 33జిల్లాలుగా విభజన చేసి ఆర్డర్ టు సర్వ్ పేరిట అర్ధరాత్రి ఆర్డర్లు ఇస్తే వాట్సాప్‌లో ఆర్డర్లు తీసుకొని జిల్లాలు ప్రారంభించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, హెల్త్ కార్డులపై సరైన నిర్ణయం తీసుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. వ్యవసాయశాఖలో కూడ క్యాడర్ స్ట్రెంత్ పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి సంగం లక్ష్మణ్ రావు, టాంసా జిల్లా అధ్యక్షుడు హరికష్ణ, సెక్రటరీ లవ కుమార్, ఒంటెల రవీందర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా జలాలుద్దీన్
కరీంనగర్ అర్బన్: జిల్లా సహకారశాఖలో సీనియర్ ఇన్స్‌పెక్టర్‌గా సేవలందిస్తున్న మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్‌కు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పిస్తూ సహకారశాఖ రిజిస్ట్రార్ జి.శ్రీనివాస్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జలాలుద్దీన్ అక్బర్ టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, రాష్ట్ర టీసీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ గౌడ్, రాజవర్ధన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు.
సీడ్‌బాల్స్ పంపిణీ
కరీంనగర్‌క్రైం: జైళ్లశాఖ డీజీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన ‘సేవ్ ఎన్విరాన్‌మెంట్’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జైలు అధికారులు జైలులో ఖైదీలతో తయారు చేయించిన సీడ్‌బాల్స్ పంపిణీ చేశారు. కొన్ని మల్కాపూర్, కమాన్‌పూర్ ఏరియాలోని ఖాళీస్థలాల్లో విసిరారు. నాలుగు వేల వరకు ఖాళీ స్థలాల్లో వేయగా, మరో నాలుగు వేల వరకు జైలు బంకులో పంపిణీ చేసినట్లు సూపరింటెండెంట్ విజయ్‌దేని తెలిపారు. జైలర్ శ్రీనివాస్, డిప్యూటీ జైలర్ అజయ్‌చారి పాల్గొన్నారు.

సంఘటిత పోరాటాలకు సన్నద్ధం కండి

సంఘటిత పోరాటాలకు సన్నద్ధం కండి