
ఇలా అయితే ఎలా?
డ్రైనేజీ వ్యవస్థ లేకుండా నగరం లండన్, న్యూయార్క్ ఎలా అవుతుంది. స్మార్ట్‌సిటీ పనుల్లో డ్రైనేజీ పనులు చేర్చితే ముంపు సమస్య ఉండేది కాదు. ప్రజా ప్రతి నిధులం ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలే దు. వర్షాకాలం వచ్చిందంటే శర్మనగర్, సాహెత్‌నగర్ మునుగుతాయి. సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి. నూతన డ్రైనేజీలు నిర్మించాలి. ముంపును నివారించాలి. – మెండి చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్
అధికారుల తప్పుతోనే
డ్రైనేజీ నిర్మాణ సమయంలో అధికారులు చేసిన తప్పుతో ఏటా నగరంలోని రాంనగర్ స్టేజీ మునుగుతోంది. నేరుగా వెళ్లే డ్రైనేజీని దారిమళ్లించడంతో వరద సులువుగా వెళ్లడంలేదు. పద్మావతి పంక్షన్‌హాల్ వద్ద ఉన్న కల్వర్టుస్థానంలో కెపాసిటీ పెంచి కొత్తగా కల్వర్ట్ నిర్మాణం చేపడితే కొంతైనా సమస్య తగ్గుతుంది. లేకుంటే ఏటా ఇబ్బందులు తప్పవు. రానురాను పెరుగుతుంది. – కల్వకుంట్ల ప్రమోద్‌రావు, రాంనగర్

ఇలా అయితే ఎలా?