
అందుబాటులో ఉంచాలి
యునాని వైద్యానికి డిమాండ్ పెరిగింది. ప్రజలకు ఎక్కువగా అవసరముండే దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో లేకపోవడంతో నిరుపేదల ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. యునానిశాఖ స్పందించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి.
– సత్యనారాయణరావు, కరీంనగర్
ఇండెంట్ పంపించాం
యునాని ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మందుల కోసం ఇండెంట్ పంపించాం. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఎక్కువగా అవసరముండడంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడం లేదు. దీంతో మందులు అందించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– యశ్రబ్ సుల్తానా, యునాని వైద్యురాలు

అందుబాటులో ఉంచాలి