
పలువురు నాయబ్ తహసీల్దార్ల బదిలీ
కరీంనగర్ అర్బన్: జిల్లాలో పలువురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అర్బన్ ఎన్‌టీ కమ్రుద్దీన్‌ను చొప్పదండి (ఎలక్షన్), చొప్పదండి (ఎలక్షన్ ఎన్‌టీ) మనోజ్ కుమార్‌ను కరీంనగర్ అర్బన్‌కు బదిలీ చేశారు. హుజూరాబాద్(ఎలక్షన్) నుంచి పి.సాయికృష్ణను అక్కడే రెగ్యులర్‌గా నియమించారు. హుజూరాబాద్ ఎంఎల్‌ఎస్ పా యింట్ ఇన్‌చార్జీ ప్రేమలతను హుజూరాబాద్ ఎలక్షన్ విభాగానికి, హుజూరాబాద్ ఎన్‌టీ అజ్మత్ నవాజ్‌ను సివిల్ సప్లై డీఎం ఆఫీస్‌కు బదిలీ చేశారు. సివిల్ సప్లై డీఎం ఆఫీస్ ఎన్‌టీ జి. ప్రణీత్ కుమార్‌ను గన్నేరువరంకు, రామడుగు నుంచి ఎం.అరుణ్ కుమార్‌ను కొత్తపల్లికి, కొత్తపల్లి నుంచి సుమలతను రామడుగు, చొప్పదండి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జీ సుధీర్‌ను డీఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు.