
నగరాన్ని ముంచెత్తిన వరద
వర్షాకాలంలో నగరవాసులకు అవస్థలు తప్పడం లేదు. శనివారం కొద్దిసేపు కురిసిన భారీ వర్షానికే నగరంలోని కూడళ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వర్షానికి మంచిర్యాల చౌరస్తా మునిగింది. శర్మనగర్ నాలా నిర్వహణ లోపంతో వరద రోడ్డుపైకి రావడం మామూలే. ఈ సీజన్‌లో ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో సమస్య బయటపడలేదు. శనివారం కురిసిన భారీ వర్షంతో మంచిర్యాల చౌరస్తాలో రోడ్లపైకి వరద వచ్చింది. గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శర్మనగర్, సాహెత్‌నగర్, గాయత్రినగర్, అమెర్‌నగర్, రాంనగర్, ముకరంపురతో పాటు తదితర కాలనీలు జలమయమయ్యాయి. గాయత్రినగర్‌లోని రోడ్ నంబర్–4 మైసమ్మ గుడి సమీపంలో ఉన్న నాలా నిండిపోయి, రోడ్డు వెంట వరద పారింది. వరద సమస్యలపై బల్దియా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – కరీంనగర్ కార్పొరేషన్