
జిల్లా జైలు సందర్శన
కరీంనగర్‌క్రైం: జిల్లా జైలును డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.వెంకటేశ్ సందర్శించారు. ఖైదీల భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యలు, ములాఖత్ గురించి అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ జి.విజయదేని, జైలర్లు పి.శ్రీనివాస్, ఏ.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఉద్యానవన అధికారిపై సస్పెన్షన్ వేటు
కరీంనగర్ అర్బన్/ ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖ అధికారి ఎస్.సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లాలో సెరికల్చర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన జిల్లా ఇన్‌చార్జి అధికారిగా కొనసాగుతు న్నారు. కార్యాలయంలో హెచ్‌ఈవోగా విధులు నిర్వహిస్తూ గత జూన్‌లో ఉద్యోగ విరమణ పొందిన స్వామి పెన్షన్‌కు నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాధితుడు ఆ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో పనిచేసిన స్థానంలో కూడా పలు పొరపాట్లపై వేటు పడినట్లుగా సమాచారం. ఈయన స్థానంలో హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న నర్సయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.