
మేమే ముందు కాల్పులు జరిపినం
ఆ రోజు సాయంత్రం ఐదున్నర అయితుంది. పోలీసులు మేమున్న ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి నేను, రణధీర్ ముందుగా కాల్పులు జరిపినం. పోలీసులకు గాయాలైనవి. వెంటనే గోడ నుంచి జంప్ చేసి బయటకు వచ్చి మక్క చేనులో పడి తప్పించుకున్నం. చెరో దిక్కు ఆయుధాలతో సహా వెళ్లిపోయినం. తెల్లారి మేం మళ్లీ వేరేచోట కలుసుకున్నం.
– జగన్, జనశక్తి జిల్లా కమిటీ సభ్యుడు, గోవిందారం
పక్కా సమాచారం ఉంది
నూకలమర్రిలో నక్సలైట్లు ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. నేను, మా గన్‌మెన్స్, వేములవాడలో అందుబాటులో ఉన్న వాళ్లను తీసుకుని వెళ్లాం. నేరుగా వెళ్లి ఆ ఇంటి ముందే ఆగాం. అప్పుడే బయటకు వస్తున్న నక్సలైట్లు మమ్మల్ని చూసి ఫైర్ ఓపెన్ చేశారు. నాకు తూటా పొట్టలో తగిలింది. నన్ను హైదరాబాద్ తరలించారు. అప్పట్లో ఆ ఎన్‌కౌంటర్ సంచలనం.
– కె.ముళీధర్‌రావు, రిటైర్డు ఎస్పీ, హైదరాబాద్
ఊరంతా భయంతో వణికిపోయారు
25 ఏళ్ల కిందట జరిగిన ఆ ఎన్‌కౌంటర్ రోజు ఊరంతా భయంతో వణికిపోయారు. ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అర్ధరాత్రి వరకు కాల్పులు.. కమురు వాసన వచ్చింది. ఓ దిక్కు వాన.. కరెంట్ లేదు. తెల్లారేసరికి ఏడుగురు గొల్లొల్ల దేవయ్య ఇంట్లో ఎన్‌కౌంటర్ అయినట్లు తెలిసింది. కళ్ల ముందే ఊరోళ్లు ముగ్గురు శవాలయ్యారు. చాలా బాధ అనిపించింది.
– బొడ్డు నారాయణ, నూకలమర్రి

మేమే ముందు కాల్పులు జరిపినం

మేమే ముందు కాల్పులు జరిపినం