
మున్నూరు కాపులు ఎదగాలి
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో సంఖ్యాపరంగా మున్నూ రు కాపు జనాభా లెక్కల్లో స్పష్టత లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లో శుక్రవారం మున్నూరు కాపు జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాలవారీగా మున్నూరు కాపు కులస్తుల లెక్కలను తామే బహిర్గతం చేస్తామన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్ర ముకాస అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు చల్లా హరిశంకర్, జేఎన్.వెంకట్, బుక్క వేణుగోపాల్, గంగుల సుధాకర్, బొమ్మ రాధాకృష్ణ, నలువాల రవీందర్, కర్ర రాజశేఖర్, పురుమళ్ల శ్రీనివాస్, బొమ్మరాత్రి రాజేశం, వేల్పుల శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.