
ఈటల వర్గీయుల ప్రత్యేక సమావేశం
హుజూరాబాద్/వీణవంక: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గీయులు శుక్రవారం హు జూరాబాద్‌లోని మధువని గార్డెన్‌లో, వీణవంకలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమయ్యారు. బీజేపీలో చేరినప్పటినుంచి తమను బండి సంజయ్ వర్గానికి చెందిన నాయకులు రెండోశ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని, పలు సమావేశాలకు ఆహ్వానాలు ఇవ్వడం లేదన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో 16శాతం ఉన్న ఓటింగ్ 36 శాతానికి పెరి గిందన్నారు. అయినప్పటికీ సంజయ్ వర్గంవారు తమను ఎదగకుండా చూస్తున్నారని తెలిపారు. పార్టీ పదవుల పంపకంలోనూ ఈటల అభిమానులకు చోటు దక్కకుండా చేశారన్నారు. సంజ య్ వర్గానికి రెడ్‌కార్పెట్ వేస్తూ మొండిచేయి చూ పుతున్నారన్నారు. హుజూరాబాద్‌లో జరిగిన సైకి ళ్ల పంపిణీ కార్యక్రమానికి కూడా తమకు ఆహ్వా నం ఇవ్వలేదన్నారు. త్వరలో జరగబోయే స్థానికసంస్థల ఎన్నికల్లోనూ మొండిచేయి చూపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు శనివారం ఎంపీ ఈటలను కలిసి, కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.