
వాహిని షాపింగ్ మాల్ ప్రారంభం
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని ఉస్మాన్‌పురలో నూతనంగా ఏర్పాటుచేసిన వాహిని షాపింగ్ మాల్‌ను బుధవారం ప్రముఖ సినీనటి అనుపమ పరమేశ్వరన్, జాజూ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు ఓం ప్రకాశ్‌జీ జాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్‌మాల్‌లో వివిధ రకాల వస్త్రాల డిజైన్లు పరిశీలించి, బాగున్నాయన్నారు. ‘హాయ్ కరీంనగర్.. ఎలా ఉన్నారు’ అని సినీనటి అనుపమా పరమేశ్వరన్ అభిమానులను పలుకరించారు. షాషింగ్‌మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ షాపింగ్‌మాల్ ప్రారంభానికి వచ్చిన కస్టమర్లకు, ప్రజలకు, శ్రేయోభిషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేణుభాయ్ జాజు, కమల్ భాయ్ జాజు, వేముల శ్రీనివాస్, విష్ణు, దేవరాజ్, నాగరాజ్, శ్రీకాంత్, మెండె అనిల్‌కుమార్, గడ్డం అభిషేక్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్‌కుమార్, ప్రశాంత్, దీకొండ రాజు పాల్గొన్నారు.

వాహిని షాపింగ్ మాల్ ప్రారంభం