
ఇంటికొకరు సీపీఆర్ శిక్షణ తీసుకోండి
కరీంనగర్‌టౌన్: సీపీఆర్‌పై మూడు దశాబ్దాలుగా శిక్షణ ఇస్తూ, ఎన్నో అవార్డులు అందుకున్న డాక్టర్ రామక శ్రీనివాస్ సేవలు అద్భుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ప్రస్తుతం గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువైన నేపథ్యంలో ప్రతి ఇంటికి కనీసం ఒక్కరైనా సీపీఆర్ ప్రక్రియపై శిక్షణ తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కలిశారు. సీపీఆర్‌పై అవగాహన కల్పించేందుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా రూపొందించిన స్టాంప్‌ని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలవాయి రవీందర్ పాల్గొన్నారు.