
‘అల్ఫోర్స్’ విద్యార్థినులకు హార్విన్ టెక్నాలజీస్‌లో
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ఈ నెల 15న జరిగిన హైదరాబాద్ హార్విన్ టెక్నాలజీస్ కంపెనీ ఇంటర్వ్యూలో 19 వంది బిజినెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అసోసియేట్‌గా ఎంపికై నట్లు కరస్పాండెంట్ వి.రవీందర్‌రెడ్డి తెలిపారు. సుమారు 38 మంది విద్యార్థులు హాజరుకాగా.. 19మంది ఎంపికవ్వడం సంతోషదాయకమన్నారు. తృతీయ సంవత్సరం పరీక్షల తరువాత కూడా ప్లేస్మెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులను కళాశాల ప్రాంగణంలో బుధవారం రవీందర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలతో అభినందించి నియామక పత్రాలు అందజేసారు. కంపెనీ ప్రతినిధులు వివేక్, రామకృష్ణ, వైష్ణవి పాల్గొన్నారు.