ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

దోమకొండ/లింగంపేట/తాడ్వాయి: అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధురిమ అన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదును పరిశీలించారు.ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వెంటనే వారి వివరాలను రిజిస్టర్‌లో సైతం నమోదు చేయాలన్నారు.ఎంపీవో రవికుమార్‌, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, తదితరులున్నారు. లింగంపేట మండలం మెంగారంలో ఆదివారం ఉపసర్పంచ్‌ బాలాగౌడ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కరపత్రాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కుటుంబాలకు మేలు చేయడానికి ఇందిరమ్మ బీమా ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ గ్రామంలో ఆదివారం ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదును కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు గైని రాజలింగం ప్రారంభించారు. వీడీసీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, నాయకులు కిషన్‌రావు, మోహన్‌గౌడ్‌, భీరయ్య, రాజిరెడ్డి, రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

5న సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యం వేలం

పిట్లం: మండలంలో సీజ్‌ చేసిన పీడిఎస్‌ బియ్యాన్ని వేలం వేస్తున్నట్లు తహసీల్దార్‌ మహేందర్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సీజ్‌ చేసిన 311.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని డిసెంబర్‌ 5న ఉదయం 11 గంటలకు పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాంలో బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాంలో ఉన్న బియ్యంను పరిశీలించవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు రూ.10 వేల ఈఎండీ చెల్లించాలని సూచించారు.

రామారెడ్డి 5:30 బ్యాచ్‌ ఆధ్వర్యంలో

పరుగు పందెం

రామారెడ్డి: రామారెడ్డి గ్రామంలోని ’5:30 బ్యాచ్‌’ ఆధ్వర్యంలో 100 మీటర్లు , 1600 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా ఈ పోటీలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని, పోటీల తేదీ, సమయం, వేదిక వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి

బాన్సువాడ రూరల్‌: ఉపాధిహామీ(వీబీజీరాంజీ) లో భాగంగా అర్హులైన ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని చిన్నరాంపూర్‌ గ్రామ సర్పంచ్‌ మల్లుగొండ, ఉప సర్పంచ్‌ షేఖ్‌ అజీజ్‌లు కోరారు. ఆదివారం వారు గ్రామంలో ఇంకుడుగుంత పనులు పరిశీలించారు. పలుచోట్ల ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంకష్టహర గణపతి

ఆలయ కమిటీ ఎన్నికలు

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి సంకష్టహర గణపతి ఆలయ కమిటీ కార్యవర్గాన్ని ఆదివారం బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నుకున్నారు. పడమట హౌసింగ్‌బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కే.వేణుగోపాల్‌, కే.శ్రీనివాస్‌లు ఎన్నికల అధికారులుగా ఆలయ కమిటీ ఎన్నికలు నిర్వహించగా 233 మంది కాలనీసభ్యులు పాల్గొన్నారు. బి.రవీందర్‌గౌడ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడికి ప్రధానకార్యదర్శి, కోశాధికారిని నియమించుకునే అధికారం అప్పగించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు చీటి పాండురంగరావు, గోపాలకృష్ణ, మహిపాల్‌రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన

సంఘం మండల కమిటీ..

నస్రుల్లాబాద్‌: ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం మండల కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు బంగారు మైశయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రామాలయ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షుడిగా నీరడి ప్రవీణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌ను ఎన్నుకున్నామన్నారు. మండల కమిటీ ప్రధాన కార్యదర్శి ఉల్లెంగ కిరణ్‌, ఉపాధ్యక్షులు రెడ్డి దత్తు, కోశాధికారిగా మామిడి శివలను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నూతన కమిటీని సన్మానించారు.సంఘం సభ్యులు ప్రశాంత్‌,మన్నె సాయిలు,గైని సాయిరాం,శ్రీనివాస్‌, రెడ్డి శ్రీనివాస్‌,గంగాధర్‌,కొర్వ భూమయ్య పాల్గొన్నారు.

కల్యాణ మండప

ఫ్లోరింగ్‌ పనులు ప్రారంభం

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మండపం గ్రౌండ్‌ఫ్లోర్‌ ఫ్లోరింగ్‌ పనులు ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి తన సొంత నిధులతో చేపట్టారు. కార్యక్రమంలో వీడీసీ ప్రతినిధులు జి.గంగారామ్‌, మున్సిపల్‌లో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎం.శ్రీకాంత్‌, కౌన్సిలర్‌ కాసర్ల మాధవి, భానుప్రకాష్‌, ప్రతినిధులు లింగారావు, రాహుల్‌కుమార్‌, ద్యావరి నవీన్‌, కాసర్ల రవీందర్‌, రజనీకాంత్‌రావు, రామకృష్ణారావు, విఫుల్‌జైన్‌, రాజగోపాల్‌, మర్కంటి స్వామి, నీలం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

లింగంపేట: మండల కేంద్రానికి చెందిన బీజేపీ కార్యకర్త బొల్లు గణేశ్‌ తల్లి సత్తవ్వ మృతి చెందడంతో ఆయన్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. మృతురాలు చిత్రపటానికి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జిల్లా జాయింట్‌ సెక్రెటరీ దాసరి అనిల్‌, నాయకులు రాజ్‌దాస్‌, కిష్టయ్య, సంతోష్‌, శుభాష్‌, బాలయ్య, వెంకటి, నరేష్‌, ప్రశాంత్‌ తదితరులున్నారు.

పగలే వెన్నెల

బాన్సువాడ రూరల్‌: మండలంలోని బోర్లంక్యాంపులో అధికారుల అలసత్వంతో విద్యుత్‌ దీపాలు పగటిపూట కూడా వెలుగుతునే ఉన్నాయి. విద్యుత్‌ వృథా అవడంతో పాటు పంచాయతీ బిల్లు తడిసిమోపెడవుతోంది. అధికారులు స్పందించి పగటిపూట వీధిదీపాలు వెలుగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్షిప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement