ఎల్లారెడ్డి/నిజాంసాగర్ : తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దీక్షతోనే కీలక మలుపని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు.కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును స్మరించుకుంటూ ఆదివారం ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా సురేందర్ మాట్లాడారు. త్యాగాలు, పోరాటాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వెనుకబడి పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి వెళ్లి నిరంతరం కృషి చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేసీఆర్ దీక్షతో రాష్ట్ర ఏర్పాటు
బిచ్కుంద మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమానికి జెడ్పీ మాజీ చెర్మన్ దఫేదార్ రాజు హాజరై మాట్లాడారు. కేసీఆర్ దీక్షతో రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆయా మండలాల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గోన్నారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డిని
అధికారంలోకి రానివొద్దు: బాజిరెడ్డి
బాన్సువాడ : బాన్సువాడ ప్రాంతంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలని, అందుకు కార్యకర్తలందరూ సమష్టిగా కష్టపడాలని బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పార్టీని మోసం చేసే వారిని ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆదివారం బాన్సువాడలోని భారత్ గార్డెన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దీక్ష దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అది కేవలం మాజీ సీఎం కేసీఆర్ వల్లనే అని పేర్కొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో నీరు ఉందని, రైతులు పంటలు వేసుకునేందుకు నీరు సరిపోతాయన్నారు. బాన్సువాడపై మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అంతకు ముందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఉద్యమ కారులను సన్మానించారు. నాయకులు మోరిల్ శ్రీనివాస్‌రావు, నాయకులు నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, యలమంచలి శ్రీనివాస్‌రావు, కోటగిరి శ్రీనివాస్, శ్రీనివాస్, అక్బర్, సాయిబాబా, మోచీ గణేష్, రాంచందర్, ధర్మతేజ, మాదవరెడ్డి, రవి, చీదరి బాలకృష్ణ, లయక్, ఇసాక్ తదితరులున్నారు.


