సాక్షి స్పెల్‌ బీకి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌ బీకి విశేష స్పందన

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

● పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు

● ఆంగ్లం, గణితం పై ఆసక్తి

పెరుగుతుందంటున్న చిన్నారులు

ఖలీల్‌వాడి: విద్యార్థులో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్‌ బీ కాంపిటేషన్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లిలో ఉన్న ఆల్ఫోర్స్‌ హై స్కూల్‌లో ఆదివారం స్పెల్‌ బీ ఇంగ్లిష్‌, మ్యాఽథ్‌ బీ(సెమీ ఫైనల్స్‌) పరీక్షలను నిర్వహించారు. దీనికి మెయిన్‌ స్పాన్సర్‌గా డూక్స్‌ వాఫీ, డ్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌(రాజమండ్రి) వ్యవహరించాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో విజయం సాధించిన వారు పోటాపోటీగా పరీక్షలు రాసి జిల్లా స్థాయిలో తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నిజామాబాద్‌ సాక్షి బ్యూరో చీఫ్‌ పాదం వెంకటేశ్‌, సాక్షి టీవీ నిజామాబాద్‌ కరస్పాండెంట్‌ కిరణ్‌రెడ్డి, ఆల్ఫోర్స్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీలత మాట్లాడుతూ.. విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనడంతో వారికి ఇంగ్లిష్‌, గణితం పరంగా నాలెడ్జ్‌ పెరుగుతుందన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ‘సాక్షి’ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. ఆంగ్లం, మ్యాథ్స్‌ పై ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటు వాటిపై మక్కువ పెంచేలా, ఆసక్తి కలిగించేలా ప్రయత్నం చేస్తున్న ‘సాక్షి’ కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీ పరీక్షలో పాలుపంచుకున్న విద్యార్థుల మనోగతం వారి మాటల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement