క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్‌

Nov 30 2026 12:52 AM | Updated on Nov 30 2026 12:52 AM

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్‌ వెలమ కన్వెన్షన్‌ ప్రారంభోత్సవం సుభాన్‌రెడ్డి సేవలు ఆదర్శం విహారయాత్రలో విద్యార్థులు వాహనాల తనిఖీ

బాన్సువాడ: క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని బాన్సువాడ టౌన్‌ సీఐ శ్రీధర్‌ అన్నారు. ఆదివారం బాన్సువాలో మేరా యువ భారత్‌ ఆధ్వర్యంలో సండే ఆన్‌ స్లైకింగ్‌ 100వ ఎడిషన్‌ను సీఐ ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని, శారీరక ధృడత్వంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువకులతో సైకిల్‌ ర్యాలీలో సీఐ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు సునీల్‌ రాథోడ్‌, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కోనాల గంగారెడ్డి, హన్మాండ్లు, శివలాల్‌, గణేశ్‌, నవీన్‌ తదితరులున్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా వెలమ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అసోసియేషన్‌ ప్రాంగణంలో నూతన వెలమ కన్వెన్షన్‌ ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం కార్తీక వనభోజనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ఉసిరిచెట్టు పూజ, బ్రాహ్మణులకు కార్తీక దీపదానం అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కన్వెన్షన్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావు, ఐవా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణమనేని పాపారావు, ప్రధాన దాత లోయపల్లి నర్సింగరావు, పీచర దామోదరరావు, ఐవా విద్యాదాన నిధి చైర్మన్‌ పిలేని రవీందరరావులు మాట్లాడారు. వెలమ సమాజ ఐక్యత, పరస్పర సహకారంతో సామాజికంగా, విద్యాపరంగా మరింత ఎదగాలని తెలిపారు. అనంతరం వనభోజనాలు, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు గాండ్ర మధుసూదనరావు, ఉపాధ్యక్షులు చీటి పాండురంగరావు, గౌరినేని మధుసూదనరావు, జలగం సుజాత, ప్రధాన కార్యదర్శి పుసుగోటి రాజగంభీరరావు, కోశాధి కారి ఇలేని రాజేశ్వరరావు, కార్యనిర్వాహక కా ర్యదర్శులు చింతలపల్లి శ్రీధర్‌రావు, గన్న మనేని వెంకటరామరావు, చీటి పరంధామ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు: విద్యా రంగానికి సుభాన్‌రెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాచాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఏనుగు సుభాన్‌ రెడ్డి పదవీ విరమణ చేశారు .ఈ సందర్భంగా ఆయన సొంత గ్రామమైన లక్ష్మీ దేవుని పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కుషాల్‌ మాట్లాడుతూ సుభాన్‌ రెడ్డి వృత్తిని ఎంతో ఆనందంగా, సంతోషంగా కొనసాగించారని గుర్తు చేశారు. రాష్ట్ర గెజిటెడ్‌ హెడ్మాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారెడ్డి మాట్లాడుతూ సుభాన్‌ రెడ్డి సైన్స్‌ టీచర్‌ ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారన్నారు. ఆయన్ను పలువురు శాలువాతో సత్కరించారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పీఆర్టీయూ మహిళా విభాగం అసోసియేట్‌ అధ్యక్షురాలు శైలజ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, మండల అధ్యక్షులు గిరిధర్‌ , రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ తిరుమల రెడ్డి, మాజీ ఎంపీపీ కిషన్‌ రావు, కాచాపూర్‌ సర్పంచ్‌ పాలమాకుల జ్యోతి సంతోష్‌ గౌడ్‌, కామారెడ్డి పట్టణ విద్యాసంస్థల అధినేత హరిస్మరణ్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ లింగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

భిక్కనూరు: మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయం విద్యార్థులు ఆదివారం విహార యాత్రకు తరలి వెళ్లారు. నాచారం లక్ష్మీనరసింహాస్వామి, వర్గల్‌ సరస్వతి అమ్మవారు, ఆలియబాద్‌ రత్నాలయ దేవాలయాలను సందర్శించారు. పాఠశాల కరెస్పాండంట్‌ బండి సుధాకర్‌, ప్రిన్సిపాల్‌ లింగాల శ్రీకాంత్‌ గౌడ్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

తాడ్వాయి: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేశారు. వాహన ధ్రువీకరణ పత్రాలు, హెల్మెట్‌ లేని ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. గతంలో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను వాహనాదారులతో ఆన్‌లైన్‌ ద్వారా కట్టేలా చర్యలు తీసుకున్నారు. తనిఖీలో కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement