యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి

Oct 24 2026 5:53 AM | Updated on Oct 24 2026 5:53 AM

● ఇందూరులో ‘హనుమాన్‌ కథ’

వైభవం అద్భుతం

● అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌ పాల్‌ సూర్యనారాయణ

నిజామాబాద్‌ రూరల్‌: యువత ఆధునిక, సాంకేతికతతోపాటు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌లో శుక్రవారం నిర్వహించిన హనుమాన్‌ కథ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్‌ కథ వైభవం ప్రవచన రూపంలో అందించడం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌, గీత పరివార్‌ అధ్యక్షుడు గోవిందు గిరీజీ మహరాజ్‌ ఇందూరుకు రావడం, హనుమాన్‌ కథ వినిపించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా హనుమంతుడి చరిత్ర అందరికీ తెలుసని, కానీ తెలియని విషయాలు ప్రవచన రూపంలో స్వామీజీ అందజేశారన్నారు. ఇప్పటి యువత హిందూ దేవుళ్ల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిర్వాహకులు రమేశ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌ డాలియా కుటుంబసభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్‌, మల్కాయి మహేందర్‌, నాయకులు పంచరెడ్డి శ్యామ్‌, పవన్‌ ముందడ, మారావార్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement