జాతీయ రహదారిపై కంటెయినర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కంటెయినర్‌ బోల్తా

Aug 3 2026 3:39 AM | Updated on Aug 3 2026 3:39 AM

జాతీయ రహదారిపై కంటెయినర్‌ బోల్తా

డిచ్‌పల్లి: మండలంలోని సుద్దపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కంటెయినర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. డిచ్‌పల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌ నుంచి బెంగుళూరు కు స్పేర్‌పార్ట్స్‌ లోడ్‌తో ఓ భారీ కంటెయినర్‌ వెళ్తోంది. సుద్దపల్లి గ్రామం వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డుపై పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌ షోకీన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సర్వీస్‌ రోడ్డు పై ఉన్న విద్యుత్‌స్తంబాన్ని ఢీకొనడంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement