గాంధారి : మండల పరిధిలోని సోమారం తండాకు చెందిన పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ కూతురు సాయి చెల్సియా అథ్లెటిక్స్‌లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికై ంది. హైదరాబాద్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వద్ద సాయి చెల్సియాను ఆదివారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గోపిచంద్ అభినందించారు. ఈ సందర్భంగా పీఈటీ లక్ష్మణ్ మాట్లాడుతు తాను చిన్నతనంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం పొంది చదువాలని ఉండేదన్నారు. తన కోరికను కూతురు నెరవేర్చిందని సంతోషం వ్యక్తం చేశారు.


