పరిస్థితి విషమించి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

పరిస్థితి విషమించి ఒకరి మృతి

Aug 3 2026 3:39 AM | Updated on Aug 3 2026 3:39 AM

బోధన్‌: ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్‌ బాషా(50) గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. గత నెల 29న ఇంటి నుంచి వ్యక్తిగత పని నిమిత్తం రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌కు వెళ్లాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అపస్మారకస్థితిలోకి చేరాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య వజిదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement