పిట్లం : మండల కేంద్రంలోని పిట్లం – బాన్సువాడ రహదారిపై వాహనా ల తనిఖీ చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న, వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల ను గుర్తించి జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధ రించాలని, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.
పేకాట స్థావరంపై దాడి
లింగంపేట: మండలంలోని మెంగారం అటవీ ప్రాంతంలో ఆదివారం పే కాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్ కు మార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మెంగారం అటవీ ప్రాంతంలో గుడారం వేసుకొని పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. వారి నుంచి రూ. 4100 నగదు, 5 మొబైల్ ఫో న్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.


