వినియోగానికి రైతాంగం నానో! | - | Sakshi
Sakshi News home page

వినియోగానికి రైతాంగం నానో!

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

వినియోగానికి రైతాంగం నానో!

అధికారులు ఏమంటున్నారంటే..

ఒక బాటిల్‌ 45 కిలోల బస్తాకు

సమానమంటున్న అధికారులు

ఆసక్తి చూపని అన్నదాతలు

సాధారణ ఎరువుల కోసమే ఆరాటం

రైతులు పంటల సాగులో గుళికల రూపంలో ఉండే యూరియానే వినియోగిస్తున్నారు. దీని కొరత కారణంగా ప్రతి సీజన్‌లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను అందుబాటులోకి తెచ్చింది. దీనిని వినియోగిస్తే భూసారం దెబ్బతినదని, పంటల దిగుబడులు, నాణ్యత పెరుగుతాయని, నేల కాలుష్యం తగ్గుతుందని, రవాణా చేయడానికీ ఇబ్బంది ఉండదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఒక సీసా నానో యూరియాకు.. 45 కిలోల బస్తాకు సమానమంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎరువుల కోసం పడిగాపులు.. యాప్‌తో అవస్థల బాధ తప్పుతాయంటున్నారు. అయినా రైతులు మాత్రం నానో ఎరువులకు నో చెబుతున్నారు.

రైతుల అభ్యంతరాలవి..

● సాధారణ ఎరువులు వాడితే వచ్చే తక్షణ ఫలితాలు నానో ఎరువులతో రావడం లేదు.

● నానో ఎరువులు వేస్తే పైరు పచ్చగా, ఏపుగా పెరగడం లేదు.

● నానో ఎరువులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది అదనపు ఖర్చు. అంతేకాకుండా నానో ఎరువులను పిచికారి చేసినప్పుడు ఆకులు మాడిపోతున్నాయి.

అవగాహన కరువు..

నానో ఎరువులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దీంతో వారు వీటిని వాడేందుకు ముందుకు రావడం లేదు. దీనికితోడు నానో ఎరువులపై అపోహలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం విరివిగా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఎరువుల పిచికారీ కోసం డ్రోన్లను అందుబాటులో ఉంచాలని పలువురు రైతులు కోరుతున్నారు.

పంటల సాగుకు ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువులను వాడుతుండడంతో భూసారం దెబ్బతింటోంది. అధిక యూరియా వినియోగంతో పైరు పచ్చగా ఏపుగా పెరిగినా.. తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తి ఉండడం లేదు.

నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల భూసారం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

సాధారణ యూరియా వేస్తే మొక్కలు తక్కువ శాతం నత్రజని ఉపయోగించగలుగుతాయి. నానో యూరియా వేస్తే నత్రజని నేరుగా ఆకుల ద్వారా మొక్కలకు అందుతుంది.

నానో ఎరువుల ద్వారా రవాణా ఖర్చులు, నిల్వ ఉంచే సమస్యలు తగ్గుతాయి.

గుళికల రూపంలో ఉండే యూరియానే దశాబ్దాలుగా వినియోగిస్తున్న రైతులు.. ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక నానో యూరియా బాటిల్‌ 45 కిలోల యూరియాకు సమానమని, దీని వినియోగంతో భూసారం దెబ్బతినదని అధికారులు చెబుతున్నా.. బస్తాల కోసమే ఆరాటపడుతున్నారు. – ఎల్లారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement