నోటీస్‌ అందితేనే.. | - | Sakshi
Sakshi News home page

నోటీస్‌ అందితేనే..

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

నోటీస్‌ అందితేనే..

ణన దశలో ఓటరు ఎటువంటి గుర్తింపు పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ తరువాత లింక్‌ చేయబడని లేదా గత సవరణ ఓటర్ల జాబితాతో లింక్‌ చేయడంలో వ్యత్యాసం ఉన్న వ్యక్తులకు ఈఆర్‌వో నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసు అందుకున్నవారు మాత్రమే తమ అర్హతలను నిరూపించుకునేందుకు పత్రాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న రెగ్యుల ర్‌ ఉద్యోగి/పెన్షనర్‌కు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, 1987 జూలై 1 కి ముందు ప్రభుత్వం/స్థానిక అధికారులు/బ్యాంకులు,/పోస్ట్‌ ఆఫీస్‌ల ద్వారా జారీ అయి న ఏదైనా గుర్తింపు కార్డు, సమర్థ అధికారిక సంస్థ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన పదో తరగతి మెమో, రాష్ట్ర అధికారిక సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement