దోమకొండ: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మధురిమ కోరారు. బుధవారం లింగుపల్లి, చింతమాన్‌పల్లి గ్రామాలను ఆమె సందర్శించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. చింతమాన్‌పల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులతో పాటు నర్సరీని, అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ముత్యంపేట గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీవో రవికుమార్, పంచాయితీ కార్యదర్శులు స్నేహ, పద్మ, సంజీవ్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మి, సిద్దరాములు, ఆశబోయిన కవిత తదితరులున్నారు.


