‘ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి’

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

కామారెడ్డి క్రైం: ఉద్యోగులు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐకేపీ, డీఆర్డీఏ, ఈజీఎస్‌ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో బీపీ, షుగర్‌, ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు నిర్వహించారు. 263 మంది ఉద్యోగులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌వీ గిరి, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement