దోమకొండ: నిరుపేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో సాధ్యమైందని మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులు ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయగా వారికి నూతన వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు, నేతుల సుధాకర్, అబ్రబోయిన రాజేందర్, మెడికల్ రాజు, కలీం, అబ్రబోయిన స్వామి,తదితరులు ఉన్నారు.


