మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
బిచ్కుంద: తాడ్వాయిలో మంగళవారం బీఆర్‌ఎస్ చేస్తున్న ధర్నాకు వెళ్లకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేను బిచ్కుందలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బయటకు వెళ్లకుండా ఇంటిలోపలే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా హన్మంత్ సింధే మాట్లాడుతూ కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయించడం బాధాకరమన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాటం ఆపబోమన్నారు.
బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
బాన్సువాడ : తాడ్వాయిలో అరైస్టెన మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను మంగళవారం పోలీసులు బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాన్సువాడలోనూ బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అరైస్టెన వారిలో జుబేర్, సాయిబాబా, అంజిరెడ్డి, అక్బర్, బలరాంనాయక్, ఫారూఖ్ ఉన్నారు.
హైదరాబాద్‌లో మాజీ మంత్రి..
తాడ్వాయికి రాకుండా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
బాన్సువాడ : ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


