జిల్లాలో ఎరువుల కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎరువుల కొరత లేదు

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను

తిప్పికొడతాం

ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు

మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో ఎరువుల కొరత లేదని ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా, యూరియా అందుబాటు విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయం లేకపోవడం లోటుగా ఉండేదని, ఆ లోటును భర్తీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో పీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement