బదిలీ అయిన న్యాయమూర్తికి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

బదిలీ అయిన న్యాయమూర్తికి వీడ్కోలు

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

కామారెడ్డి టౌన్‌ : బదిలీ అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌కు మంగళవారం కామారెడ్డి జుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన హైదరాబాద్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా వెళ్తున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అందించిన సేవలను సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ సుమలత, జూనియర్‌ సివిల్‌ జడ్జి సుధాకర్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి దీక్ష, ఎల్లారెడ్డి జూనియర్‌ సివిల్‌ జడ్జి సుష్మ, బిచ్కుంద జూనియర్‌ సివిల్‌ జడ్జి వినీల్‌ కుమార్‌ తదితరులు ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రామ్‌చంద్రరావు, జిల్లా జుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భుజంగరావు, సీనియర్‌ సూపరింటెండెంట్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ వి.చంద్రసేన్‌రెడ్డి, కోర్టు సిబ్బంది సయ్యద్‌ రషీద్‌ అలీ, కరుణ, మమత, సంధ్య, శిల్ప, రజిత, సాయికృష్ణ, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement