పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

కామారెడ్డి క్రైం: వర్షాకాలంలో పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రత జిల్లా అధికారి విక్రమ్‌ హెచ్చరించారు. వర్షాకాలంలో వాహక జనిత అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కామారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థల్లో మూతలు లేకుండా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, అపరిశుభ్రమైన వాతావరణంలో వంటశాలలు నిర్వహించడం, ఆహార తయారీ సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాలు లేకపోవడం, గ్లౌజులు, హెడ్‌ క్యాప్‌లు ధరించకపోవడం లాంటి అనేక లోపాలు గుర్తించారు. వెంటనే లోపాలను సరిదిద్దాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement