● హోంగార్డుకు తీవ్రగాయాలు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రం సమీపంలోని 161 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందగా, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు .. మద్నూర్‌కు చెందిన రాజ్ కుమార్(52) హెడ్‌కానిస్టేబుల్‌గా , బిచ్కుందకు చెందిన మధు హోంగార్డుగా పనిచేస్తున్నారు. రాజ్‌కుమార్ మంగళవారం విధుల నిమిత్తం బైక్‌పై పిట్లం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా, మార్గమధ్యలో మధును ఎక్కించుకున్నారు. ఇరువురు కలిసి బైక్‌పై వెళుతుండగా పెద్దకొడప్‌గల్ సమీపంలోని హైవేపై ఆగిన లారీని ఢీకొన్నారు. ఈఘటనలో బైక్ నడిపిన రాజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనకాల కూర్చున్న మధుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
గత ప్రమాదంలో గాయాలతో
గట్టెక్కిన రాజ్‌కుమార్
హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌కు గతంలో రోడ్డు ప్రమాదం జరుగగా, గాయాలతో గట్టెక్కాడు. మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ రోజు అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా, అప్పటి నుంచి రాజ్‌కుమార్ కుడిచేయి సరిగా పనిచేయకుండ పోయింది.


