కామారెడ్డి క్రైం: మొహర్రం మాసంను ప్రశాంతంగా జరుపుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. మైనార్టీ మతపెద్దలతో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొహర్రం మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీధి దీపాల మరమ్మతులు, తాగునీటి వసతులు, పారిశుధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం (85558 05866)నకు ఫోన్ చేయాలని సూచించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ముస్లిం సంఘాల ప్రతినిధులు, తదతరులున్నారు.


