నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ప్రతి విద్యార్థి బాలలహ క్కులపై అవగాహన కలిగి ఉండాలని మండలంలో ని వదల్‌పర్తి సర్పంచ్ లక్ష్మి సూచించారు. వదల్‌పర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బాలలగ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలలో అదనపు తరగతి గ దులు, బాలురకు మూత్రశాలలు, ప్రహరీ నిర్మా ణాలు చేపట్టాలన్నారు. దీంతోపాటు విద్యార్థుల సౌ కర్యార్థం పాఠశాలలో వాటర్ ఫ్యూరిఫైర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు కలిగితే విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో పాఠశాల హెచ్‌ఎం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్: హలో ఉప సర్పంచ్..చలో హైదరాబాద్ పేరుతో పోస్టర్‌ను మంగళవారం ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు కర్నం భాస్కర్ నస్రుల్లాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప సర్పంచ్‌లకు వేతనం రూ.5 వేలు, వార్డు మెంబర్‌లకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సర్పంచ్‌లతో పాటు కల్పించాలన్నారు. ఈ నెల 25న హైదరా బాద్‌లో జరిగే ధర్నాకు మండల ఉప సర్పంచ్‌లు హాజరై విజయవంతం చేయాలన్నారు. బాన్సువాడ ఉప సర్పంచ్‌ల ఇన్‌చార్జి సంజీవ్, ఉప సర్పంచ్‌లు చౌదరి, రామ్మోహన్ నాయకులు శివదయాల్, కాశీరాం పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్ సదుపాయం ఉండాలని, లైన్‌మన్‌లను సంప్రదించి మీటర్లు తీసుకోవాలని అధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం మద్నూర్ ఐసీడీఎస్ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్‌గల్ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోషణ్ అభియాన్ బ్యాంక్ కో– ఆర్డినేటర్ బాలక్రిష్ణ, సూపర్‌వైజర్‌లు దేవకరణ, నసీమాలు పలు సూచనలు అందించారు. అమ్మమాట అంగన్‌వాడి బాట కార్యక్రమాల ద్వారా పిల్లల నమోదు పెంచాలని సూచించారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్ తండా అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. తండాకు చెందిన బస్సీ గిరి (45) ఇటీవల ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం గిరి మృతదేహాన్ని తండావాసులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడి మృతదేహానికి కొద్ది దూరంలో కొన్నిరోజుల క్రితం చనిపోయిన కొండచిలువ కళేబరం ఉండడంతో కొండచిలువ కాటేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. గిరి మృతదేహాన్ని సోమవారమే తండాకు తీసుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై మహేష్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు మంగళవారం గ్రామ సర్పంచ్ రావుల వినోద గడియారాలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి దర్శన్, ఉపసర్పంచ్ భిక్షపతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.


