ప్రతి రైతుకు యూరియాను అందజేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకు యూరియాను అందజేస్తాం

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

ఎరువుల కోసం ఎలాంటి

ఆందోళన వద్దు

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రతి రైతుకు యూరియాను అందజేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. పోచారంలో బుధవారం మండలంలోని ఆత్మకూర్‌కు చెందిన పాటిమీది శ్రీనివాస్‌రెడ్డికి రూ.లక్షా54వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యూరియా సరఫరాపై ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌తో మాట్లాడానన్నారు. ప్రతి పీఏసీఎస్‌ చైర్మన్లు, సీఈవోలు యూరియా కోసం సకాలంలో డీడీలు చెల్లించి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో, యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణలో నాగిరెడ్డిపేట మండలం జిల్లాలో మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. గతేడాది వచ్చిన భారీ వరదలను తట్టుకొని సురక్షితంగా నిలిచిన పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 కోట్ల 75 లక్షల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్‌, తహశీల్దార్‌ బిక్షపతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహాన్‌గౌడ్‌, నాయకులు విక్రాంత్‌రెడ్డి, వాసురెడ్డి, ఇమామ్‌, శ్రీరాంగౌడ్‌, తదితరులున్నారు.

రైతుల కోసం గోదాముల నిర్మాణం

లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు కష్టపడి పండించిన ధాన్యం కాపాడుకోవడానికి గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంతో పాటు శెట్పల్లిసంగారెడ్డిలో గోదాములు, అయ్యపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, శెట్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా ఉండడానికి ధాన్యం గోదాముల్లో నిల్వ ఉంచవచ్చన్నారు. అలాగే రైతుల కోసం మొక్కజొన్న, జొన్న కొనుగోలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌, సర్పంచ్‌ కౌడ రవీందర్‌, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌, నారాగౌడ్‌, జొన్నల రాజు, అశోక్‌, బైరయ్య, సర్పంచులు సక్రూనాయక్‌, ఏగొండ, సింగిల్‌ విండో చైర్మన్‌ దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement