● ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్
మహాసభ డిమాండ్
కామారెడ్డి అర్బన్ : ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ మహాసభ మంగళవారం కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో నిర్వహించగా ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలకు చెందిన 200 మంది కార్మికులు పాల్గొన్నారు.కామారెడ్డి కొత్త బ స్టాండ్ నుంచి రోటరీ ఆడిటోరియం వరకు ర్యాలీ ని ర్వహించారు. యూనియన్ నాయకులు కామ్రేడ్ అ హ్మద్, వీఎల్ నర్సింహారెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అమరులైన కార్మికులకు మౌనంపాటించి సంతాపం తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన యూనియన్ మాజీ ప్ర ధాన కార్యదర్శి పద్మాకర్ మాట్లాడుతూ.. కార్మి కులు ఐక్యంగా ఉంటనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత అంశాలపై వక్తలు మాట్లాడారు. నాయకులు వెంకటిగౌడ్, ప్రసాద్‌రెడ్డి, వీడీ దాస్, సంజీవ్, రమేష్, రాజు, లింగం, చందర్, మల్లయ్య, నాగరాజు, లింబాద్రి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


