సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మాదకద్రవ్యాల నిర్మూల న అందరి బాధ్యత అని జిల్లా జడ్జి వరప్రసాద్ వ్యా ఖ్యానించారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మాదకద్రవ్యాల వినియోగం, ని ర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, వ్యక్తిత్వ వి కాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియో గం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలు, స మాజాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన సామాజిక సమస్య అని పేర్కొన్నారు. అక్రమార్కులు ము ఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వలలోకి లాగేందుకు ప్రయత్నిస్తు న్నారన్నారు. అందువల్ల ప్రతీ పౌరుడు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రి న్సిపాల్ రాజారెడ్డి, డీఎల్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్‌రెడ్డి, ఐఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ కార్యద ర్శి రాజేందర్ రావు, వినాయక్ పాల్గొన్నారు.


