కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక విధానం..
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
● గ్రామ పంచాయతీల్లో
ముగ్గురికి అవకాశం
● ఎదురుచూస్తున్న ఆశావహులు
కమ్మర్‌పల్లి : గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరి గి ఆరు నెలలు గడుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రా మ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వా రు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో జరిగిన గ్రా మ పంచాయతీ ఎన్నికల అనంతరం పాలకవర్గాల కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అప్పటి ప్ర భుత్వం గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎ న్నిక విధానం ప్రవేశపెట్టింది. కానీ, ప్రస్తుత ప్రభు త్వ హయాంలో పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జాడే లేకుండా పోయింది. పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ లో ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వ రకు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి.
హోదా, అధికారం, బాధ్యతలు..
కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న వారు పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్, హోదా, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవ హరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో కోఆప్షన్ సభ్యుల పాత్ర కీలకం అవుతుంది.
సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై గ్రామానికి చెందిన ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో ఒకరు పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలాలు ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ప్రవాస భారతీయులను నియమించాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. స్పష్టమైన ఆదేశాలు రాగానే అందుకనుగుణంగా గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపడతాం.
– శ్రీనివాసరావు, డీపీవో, నిజామాబాద్


