నియామకం | - | Sakshi
Sakshi News home page

నియామకం

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

నియామకం పీసీసీ కార్యదర్శికి పరామర్శ సమస్యలు పరిష్కరించాలి వైద్య శిబిరానికి స్పందన పేదలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ

లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన పోతగోని ప్రసాద్‌గౌడ్‌ ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సోమవారం ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమృత ఫంక్షన్‌ హాల్లో జిల్లా ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. ప్రసాద్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల ఆయ న మోకాళ్ల శస్త్రచికిత్సలు చేయించుకుని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీపీ సుదర్శన్‌, కాచాపూర్‌ ఉప సర్పంచ్‌ దశరథం, జంగంపల్లి సొసైటీ అధ్యక్షుడు సిద్ధిరాములు, నాయకులు యాదయ్య, అమృత, సత్యం, సంతోష్‌ గౌడ్‌ తదితరులున్నారు.

భిక్కనూరు: ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌ రెడ్డి అన్నారు. మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్‌ కుమార్‌ గౌడ్‌ ఇటీవల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనను చంద్రకాంత్‌ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేయాలని చెప్పారు. నాయకులు రాజు, శశి కుమార్‌ పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌ ఉన్నారు.

మాచారెడ్డి: ఘన్పూర్‌లో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రి వైద్యుడు అభినయ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 226 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని మోతి బిందు ఆపరేషన్‌ కోసం సిఫారసు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అభినయ్‌ మాట్లాడుతూ.. మోతి బిందు ఆపరేషన్‌ అయిన వారికి మందులతో పాటు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సర్పంచ్‌ ప్రశాంత్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ స్వామి యాదవ్‌, పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు మహేష్‌, ప్రవీణ్‌, నరేష్‌, సతీష్‌ సురేష్‌ పాల్గొన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): పేదలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్‌ రెడ్డి అన్నారు. సోమవారం కుప్రియాల్‌లో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడు గడ్డం భూపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ వైస్‌ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌ రెడ్డి, సేవాదళ్‌ మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్‌, ఉప సర్పంచ్‌ అన్వేష్‌ గౌడ్‌, చైర్మన్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement