– విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
దోమకొండ : వరి తుకానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన అబ్బగోని రాజయ్య(48)కు గ్రామశివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరి నారుమడికి ఆదివారం నీళ్లు పెట్టేందుకు వెళ్లి బోరుమోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రభాకర్ పరిశీలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


