బోధన్ : ఎడపల్లి మండలం జంలం గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సయ్య కుటుంబీకులతో కలిసి వారం క్రితం బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకొని వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న నర్సయ్య తిరిగొచ్చి ఇంటిని పరిశీలించారు. దుండగులు మూడు తులాల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.


