యోగాతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ప్రశాంతత

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

ఒత్తిడిని జయించేందుకు యోగా ఉత్తమ మార్గమని, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వక్తలు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పలు చోట్ల ఆయుష్‌ విభాగం, బీజేపీ, శ్రీకల్కి ఆలయ కమిటీతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. వక్తలు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి తన దైవందిన జీవితంలో యోగాను భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్రం పోషిస్తుందని చెప్పారు.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement