దుబాయి వెళ్లడం ఇష్టం లేక.. | - | Sakshi
Sakshi News home page

దుబాయి వెళ్లడం ఇష్టం లేక..

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

● యువకుడి ఆత్మహత్య

లింగంపేట(ఎల్లారెడ్డి): దు బాయ్‌ వెళ్లడం ఇష్టం లేక మండలంలోని మోతె గ్రా మానికి చెందిన ఓ యువకు డు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై దీపక్‌ కుమార్‌ తెలిపి న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రంజిత్‌రెడ్డి(23) గతంలో రెండుసార్లు దుబాయి వె ళ్లి వచ్చాడు. తిరిగి ఆదివారం దుబాయి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తనకు దుబాయి వెళ్లడం ఇష్టం లేక ఆ విషయం కుటుంబ సభ్యులకు చెబితే బాధపడతారని జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లా డు. తన వ్యవసాయ బోరుబావి వద్ద ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కు టుంబసభ్యులు రంజిత్‌రెడ్డికి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు భాగ్య హన్మంత్‌రెడ్డి బోరున విలపించారు. మృతుడి అన్న రామ్మోహన్‌రెడ్డి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. మృతుడి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఓదార్చారు.

కంజర్‌లో మరో యువకుడు..

మోపాల్‌ : మండలంలోని కంజర్‌లో ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..కంజర గ్రామానికి చెందిన మమత, నర్సింగ్‌పల్లి తండాకు చెందిన పృథ్వీనాయక్‌ అలియాస్‌ అనిల్‌ (34) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పృథ్వీనాయక్‌ ఆటో నడుపుకుంటూ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడ వలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన పృథ్వీనాయక్‌ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement