13 ఏళ్ల తర్వాత కొలువుదీరిన కొత్త కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల తర్వాత కొలువుదీరిన కొత్త కార్యవర్గం

Jun 22 2026 1:18 AM | Updated on Jun 22 2026 1:18 AM

దోమకొండ : దోమకొండ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నిక కాగా వారితో ఎన్నికల అధికారి భూమయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. 9 మంది డైరెక్టర్‌లు కలిసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడుగా బత్తిసి సిద్ధరాములు, ఉపాధ్యక్షుడిగా గర్థాస్‌ గంగరాములు, కార్యదర్శిగా కూచని జగదీష్‌, కోశాధికారిగా కై రంకొండ శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా అందే నాగభూషణం, బత్తిని సంతోష్‌కుమార్‌, బాలే సురేందర్‌, కోట సదానంద, బొమ్మెర యమునలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేనేత రంగ అభివృద్ది, నేతన్నల సంక్షేమం, సంఘ ప్రగతి లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలు, కోశాధికారి సబ్బని ధర్మపురి, సర్పంచ్‌ ఐరేని నర్సయ్య, దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్‌, కోశాధికారి అందే గణేష్‌, ఉపసర్పంచ్‌ బొమ్మెర శ్రీనివాస్‌, వార్డుసభ్యులు బీసు సతీష్‌, పాలకుర్తి శేఖర్‌, ఐరేని లత, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement