నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం

Jun 21 2026 6:28 AM | Updated on Jun 21 2026 6:28 AM

బెర్త్‌ కింద దొరికిన 20 కిలోలు

పట్టుకున్న ఎకై ్సజ్‌ పోలీసులు

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో శనివారం ఎకై ్సజ్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు, ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎకై ్సజ్‌ అధికారి అరుణ్‌చంద్ర వివరాలను వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం సంబల్‌పూర్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌ కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్‌ బృందం రైలులోకి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్‌–7 బోగీలోని ఓ బెర్త్‌ కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు గంజాయి బ్యాగులు లభ్యమయ్యాయి. వాటిని తెరిచి చూడగా మొత్తం 22 ప్యాకెట్లలో మొత్తం 20 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో కేజీ గంజాయి విలువ సుమారు రూ. 50 వేల చొప్పున ఉంటుందని, మొత్తం రూ. 10 లక్షల విలువ ఉంటుందన్నారు. అయితే, బ్యాగులను రవాణా చేస్తున్న నిందితుడు ఎవరనేది తెలియలేదని, అక్రమార్కుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో డీటీఎఫ్‌ సీఐ సుందర్‌ సింగ్‌, ఎస్సైలు విక్రమ్‌, శరత్‌ కుమారి, దీపిక, రైల్వే ఎస్సై మధుసూదన్‌, ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement