ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. జాతీయ న్యాయ సేవ ప్రాధికార సంస్థ, సుప్రీంకోర్ట్, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించినట్లు వారు తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగ్గ 561 కేసులను పరిష్కరించినట్లు వారు తెలిపారు. వీటిలో క్రిమినల్ 8, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ 14, పీటీ కేసులు 459, బ్యాంకుకు సంబంధించినవి 37, సైబర్ నేరాలకు సంబంధించి 5, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు 37, భత్యంకు సంబంధించి 1 కేసును పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పండరి, శ్రీనివాస్, సతీష్, సాయిబాబా, సీఐ రాజారెడ్డి, ఎస్సై రాజు, ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద పరిధిలో 816 కేసులు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జడ్జి వినిల్ కుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రకళ సమక్షంలో ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకున్నారు. భూతగాదాలు, ఎకై ్సజ్, డ్రంక్ అండ్ డ్రైవ్, పేకాట ఇతర కేసులు మొత్తం 816 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి వినిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఆవేశానికి లోనై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదికని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంతాలకు వెళ్లకుండా గొడవలు జరిగితే గ్రామ పెద్దల సమక్షంలో కూర్చుండి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీపీ కిషోర్ కుమార్, న్యాయవాదులు లక్ష్మణ్‌రావు, ప్రకాష్, మనోజ్, విశ్వనాథ్, ఎస్సై రవి కోర్టు సిబ్బంది సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


