యూరియా యాప్‌ మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

యూరియా యాప్‌ మాకొద్దు

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

యూరియా యాప్‌ మాకొద్దు

పాతపద్ధతిలోనే అందించాలి

రైతుల డిమాండ్‌

పర్మళ్లలో అవగాహన సదస్సు

బహిష్కరణ

లింగంపేట: ‘ఈ యూరియా యాప్‌ మాకొద్దు. దీంతో ఇబ్బందిపడుతున్నాం. వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే సరఫరా చేయాలి’ అని రైతులు డిమాండ్‌ చేశారు. యూరియా యాప్‌పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పర్మళ్ల రైతు వేదికలో పర్మళ్ల, సజ్జన్‌పల్లి, ఎక్కపల్లి, మాలోత్‌తండా, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల క్లస్టర్‌కు సంబంధించిన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడీఏ సుధారాణి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే రైతులు యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. యాప్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. యాప్‌ లేనప్పుడు ప్రతి రైతుకు యూరియా అందిందని, ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 26వేల ఎకరాల సాగు భూమి ఉందని, అవసరమైన యూరియాను ఒకేసారి సరఫరా చేయాలని కోరారు. సదస్సును బహిష్కరించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధులు రాజాగౌడ్‌, శ్రీను, రాజు, రవి, గంగారెడ్డి, సిద్దయ్య, దుర్గేష్‌, ప్రభురాజ్‌, సాయిలు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement