‘స్పెషల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘స్పెషల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలి’

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

బాన్సువాడ రూరల్‌: అన్ని గ్రామాలో వారం రోజుల పాటు ఉపాధ్యాయులు స్పెషల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలని డీఈవో మల్లికార్జున్‌ సూచించారు. శుక్రవారం ఆయన బాన్సువాడ మండల ప్రత్యేకాధికారి హోదాలో మండలంలో పర్యటించి పలు పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల నమోదుపై రోజూ సాయంత్రం నివేదిక పంపాలన్నారు. ప్రీప్రైమరీ తరగతుల ప్రారంభం, బడిబాట, జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై ఎంఈవో నాగేశ్వరరావుకు పలు సూచనలు ఇచ్చారు. కొయ్యగుట్టలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement