28న పల్స్‌పోలియో | - | Sakshi
Sakshi News home page

28న పల్స్‌పోలియో

Jun 19 2026 1:06 AM | Updated on Jun 19 2026 1:06 AM

28న పల్స్‌పోలియో ‘టెట్‌ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి’ ‘ఆ ఏడు రకాల వరి విత్తనాలను విక్రయించాలి’ బడిలో చేర్పిస్తే.. పన్నులు చెల్లిస్తా

నాగిరెడ్డిపేట: జిల్లాలో ఈనెల 28న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో వెంకట్‌ తెలిపారు. నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల విషయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ సృజన్‌కు సూచించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. డయేరియా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పల్స్‌పోలియో ద్వారా జిల్లాలో 1.06 లక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట పీహెచ్‌సీ సూపర్‌వైజర్స్‌ సునంద, సుభాషిణి, అనిల్‌, డేవిడ్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌ గణేష్‌, స్టాఫ్‌నర్స్‌ మానస, మెయిల్‌ వర్కర్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎర్రాపహాడ్‌ పీహెచ్‌సీ తనిఖీ

తాడ్వాయి: ఎర్రాపహాడ్‌ పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. ఫార్మసీ, ల్యాబ్‌గదులను తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఖాసీం, హెచ్‌ఈవో నారాయణ, పీహెచ్‌ఎన్‌లు నక్షత్రం, సరస్వతి, శ్రీనివాస్‌, సుమలత, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : ఉపాధ్యాయులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌) నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం అదనపు కలెక్టర్‌ గిరిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ 2010 సంవత్సరం కన్నా ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు లక్ష్మీపతి, భాస్కర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌: ప్రభుత్వం ప్రతిపాదించిన 7 రకాల వరి విత్తనాలను రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి సూచించారు. గురువారం మహమ్మద్‌నగర్‌లోని ఫెర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. సన్నరకాలకు సంబంధించి బోనస్‌ వచ్చే వంగడాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి స్టాక్‌ వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట మండల ఏవో నవ్య తదితరులున్నారు.

నిజాంసాగర్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పి స్తే వారి ఇంటి పన్నుతో పాటు నల్లా బిల్లులను చెల్లిస్తానని మంగ్లూర్‌ సర్పంచ్‌ నర్మాల రాజు ప్రకటించారు. గురువారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్‌, ఉపాధ్యాయుడు చౌదరి నరేశ్‌, పంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement